మెగా ఆయుర్వేదిక్‌ వైద్య శిబిరంలో 150 మందికి వైద్యపరీక్షలు

  |   Telugunews

వేటపాలెం : స్దానిక రోటరి క్లబ్‌ ఆద్వర్యంలో బండ్ల బాపయ్య హిందూ జూనియర్‌ కళాశాలలో ఉచిత మెగా ఆయుర్వేదిక్‌ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని వేటపాలెం లో రోటరి క్లబ్‌ వ్యవస్దాపకులు గొల్లపూడి సీతారాం ప్రారంభించారు. ఈ సందర్బంగా క్లబ్‌ అద్యక్షులు పింజల ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ శిబిరం లో 150 మందికి వివిధ వ్యాదులకలిగిన వారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ వైద్యశిభిరం నందు ఇడుపులపాడు రాధాకృష్ణ హాస్పటల్‌, ఆయుర్వేద పంచకర్మ వైద్యనిపుణులు డా. పి. మురళీకృష్ణ, ఆయన బృందం వైద్యులు డా. బిజివి చైతన్య, డా. యమ్‌ సరస్వతి, డా. షాలిని,హైదరాబాదుకు చెందిన ఆయుర్వేద శస్త్ర చికిత్స నిపుణులు డా. సయ్యద్‌ నజీబ్‌ ఉల్లా లు రోగులను పరీక్షించారు. కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి షేక్‌ ఖదీర్‌ బాషా, పాస్ట్‌ ప్రసిడెంట్స్‌ కె. శివరామ కృష్ణ, ఆర్‌ వి రాజేష్‌, కొత్త శ్రీనివాసరావు (వాసు) , రొటేరియన్స్‌ నున్నా నాగేంద్రరావు,చేగూడి సురేష్‌, గొల్లపూడి సుధాకర్‌ఒ, పెనుగొండ శ్రీనివాసులు, టి. కోటేశ్వరరావు , ఎన్‌ సి సి క్యాడెట్స్‌ , ముఖ్య అతిదులు బండ్ల శరత్‌ బాబు, గౌరాబత్తుని రవి బాబు , పట్టభద్రుల సంఘం అద్యక్ష కార్యదర్శులు ప్రత్తి వెంకట సుబ్బారావు, గోలి బాల ప్రసాద మూర్తి, కొసనం నాగమాంబ తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/kkFf4gAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/5BADBwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬