మూడో రోజు కొనసాగుతున్న ఎస్ బి ఎం కార్మికుల సమ్మె

  |   Telugunews

కర్నూలు – తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాలలో కొనసాగుతున్న సమ్మె నేటికి మూడో రోజుకి చేరింది. కర్నూల్లో సిఐటియు జిల్లా పి. ఎస్ రాధాకృష్ణ మూడో రోజు సమ్మె దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్ పి డి సి ఎల్ యాజమాన్యం తన మొండి వైఖరి విడనాడి తక్షణమే కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు00 లేనిపక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో ఎస్ పి డి సి ఎల్ యాజమాన్యం రెండుసార్లు ఎస్ పి ఎం లో లో పనిచేస్తున్న కార్మికులు అందరికీ ఈ పి ఎఫ్, ఇ ఎస్ ఐ అమలు చేయాలని ఆదేశించిందని అన్నారు. అయితే ఉన్నత అధికారులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించటం వలనే ఈ రోజు కార్మికులు సమ్మె చేయవలసిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.. కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన కనీసకనీస వేతనాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం రంగ సంస్థ ఎస్పీడీసీఎల్ యాజమాన్యం పైన ఉందని అననారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రీజినల్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ చాలీచాలని జీతంతో 30 సంవత్సరాలు ఎస్ పి ఎన్ లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొ న్నారు. ఈ సమావేశంలో ఎస్ పి ఎమ్. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, జగదీష్, నారాయణ, శివ శివ, వెంకటేష్, కేశవులు, రాజారెడ్డి దస్తగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

ఫోటో - http://v.duta.us/Y0EsBwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/wwWCFAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬