17 ఏళ్ల తరువాత 'ఒక్కడు' సెంటిమెంట్ రిపీట్.. సీన్ చిరిగిపోతుంది

  |   Tollywood

మహేష్ బాబు సినిమాల్లో అతని ఫ్యాన్స్ ఎక్కువమందికి నచ్చిన సినిమా ఒక్కడు. మహేష్ బాబులో సూపర్ స్టార్ అనిపించుకునే స్థాయి నటుడు ఉన్నాడు అని బాక్సాఫీస్ కలెక్షన్స్ సాక్షిగా నిరూపించిన సినిమా అది. ఆ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. కానీ కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్‌లో ఫస్ట్‌టైమ్ హీరో విలన్‌ని కొట్టే సీన్ మాత్రం ఎవర్ గ్రీన్ సీన్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మహేష్ బాబు తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరులో మళ్ళీ అలాంటి హైవోల్టేజ్ సీన్స్‌తో రాబోతున్నాడు. అందుకే కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్‌ని హైదరాబాద్‌లో రీ క్రియేట్ చేసారు.

Also Read:

తన సినిమాల్లో కామెడీ తో పాటు మాస్ ప్రేక్షకులు ఇష్టపడే యాక్షన్‌ని కూడా ఉండేలా చూసుకునే అనిల్ రావిపూడి ఈ సినిమాలో మహేష్ కోసం కొన్ని పవర్ ఫుల్ ఎపిసోడ్స్ రాసుకున్నారట. అయితే వాటికి రాయలసీమ బ్యాక్‌డ్రాప్ అవసరం. అందుకే ఆ సన్నివేశాలను కర్నూల్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించినట్టు చూపిస్తున్నారు. దానికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్‌ని వేశారు. టాలీవుడ్‌లో ఐకానిక్ సెట్స్ వెయ్యడంలో మంచి అనుభవం ఉన్న AS ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ సెట్ వేశారు....

ఫోటో - http://v.duta.us/nvDyIAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/FLvlWwEA

📲 Get Tollywood on Whatsapp 💬