27న జరిగే సమ్మెను జయప్రదం చేయాలి

  |   Telugunews

పొదిలి : ప్రకాశం రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ మొండి వైఖరికి నిరసనగా ఈనెల 27న జరిగే సమ్మె సన్నాహక కార్యక్రమంగా ఆదివారం పొదిలి ఆర్‌టిసి గ్యారేజి గేటు వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పొదిలి ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిపో అధ్యక్షుడు బి.రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రీజినల్‌ మేనేజర్‌ మొండి వైఖరి వల్ల సమస్యలు పరిష్కరించబడనందున ఈనెల 27న సమ్మె జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని కార్మికులందరూ జయప్రదం చేయాలని కోరారు. గత నెల 6న రీజినల్‌ మేనేజర్‌ వివిధ సమస్యలపై స మ్మె నోటీస్‌ ఇవ్వడం జరిగిందని, దీనిపై గత నెల 8న గుర్తింపు సంఘం అయిన ఎంప్లాయిస్‌ యూనియన్‌తో రాతపూర్వక ఒప్పందం జరిగిందని, కానీ నేటి వరకూ సదరు సమస్యపై ఎలాంటి పరిష్కార మార్గాలు చూపకపోగా కార్మికులపై పనిభారం పెంచే విధంగా నిర్ణయాలు చేయడం పట్ల నిరసనగా అనేక దఫాలుగా ఆర్‌యం దృష్టికి, కార్మికశాఖ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఆర్‌టిసి రీజినల్‌ అధికారులు కార్మిక చట్టాలు, మోటార్‌ వాహన చట్టాలకు విరుద్దంగా కార్మికులను డ్యూటీలు చేయమనడాన్ని గుర్తింపు సంఘంగా ఎంప్లాయిస్‌ యూనియన్‌ పూర్తిగా వ్యతిరేఖిస్తున్నదని అన్నారు. జిపియస్‌ విధానం ద్వారా ఓటి టైంను నిర్ధారించాలని, 2011 నామ్స్‌ ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలని డిజిటల్‌ చార్ట్‌లోని అవకతవకలను సరిచేయాలని పలువురు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ కె.వి రావు, సీనియర్‌ నాయకులు జి.కాలేబు, ఎస్‌. వెంకటేశ్వర్లు, రీజినల్‌ నాయకులు పి.ఎఎన్‌ రెడ్డి, పి.కొండరావు, గ్యారేజ్‌ అధ్యక్ష, కార్యదర్శులు డి.సి.హెచ్‌ అంజయ్య, ఆర్‌. అంజయ్య, ఆర్‌. సుబ్బారావు, డిపో నాయకులు ఎస్‌కెకె భాష, కెహెచ్‌ రావు, పియస్‌ రావు, విజయలక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొని 27న జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

ఫోటో - http://v.duta.us/1eElMgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/jWHGyQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬