Upasana: కోడలి ఫొటోలు తీసిన చిరంజీవి

  |   Tollywood

మెగాస్టార్ చిరంజీవికి తన కోడలు ఉపాసన అంటే ఎంతో ప్రేమ, అభిమానం. కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంటారు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఎంతో గొప్పగా చెప్పుకొంటూ ఉంటారు. ఎవరి సాయం లేకుండా ఇండస్ట్రీలో తన కాళ్లపై తాను నిలబడిన మామయ్య అంటే ఉపాసనకు అమితమైన ప్రేమ. కాగా.. తన మామయ్య నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ ఈవెంట్‌కు ఉపాసన కూడా హాజరయ్యారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన గౌనును ధరించారు.

ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఉపాసన తన మామయ్య చేత ఫొటోలు తీయించుకున్నారు. ఈ ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘సైరా నరసింహారెడ్డి ఈవెంట్‌కు ముందు నా స్వీటెస్ట్ మామయ్య నా ఫొటోలు తీశారు. నేను వేసుకున్న దుస్తులు ఆయనకు ఎంతో నచ్చాయి. అందుకే ఆయన ఫొటోలు తీశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన ఫొటోలు తీస్తున్నప్పుడు గోడపై కనిపిస్తున్న ఆయన ప్రతిరూపాన్ని మీరు చూడొచ్చు. ఈరోజు (ఆదివారం) జాతీయ కుమార్తెల దినోత్సవంతో పాటు సైరా వేడుక కూడా జరిగింది. ఇంతకంటే అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోలేను. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు....

ఫోటో - http://v.duta.us/e4WtWAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/T_X-mwAA

📲 Get Tollywood on Whatsapp 💬