ఆర్టీసీ యూనియన్‌ల ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం

  |   Telugunews

పొదిలి : పొదిలి ఆర్టీసీ డిపోలో కార్మికుల యూనియన్లు ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సంధర్భంగా సీనియర్‌ నాయకులు పిఎస్‌ మూర్తి మాట్లాడుతూ… రాష్ట్ర విభజన సంధర్భంలో ఆర్టీసీ మనుగడ సాధించాలంటే ఆర్‌టిసిని ప్రభుత్వంలే విలీనం చేయడం తప్పనిసరి అని డిమాండ్‌ చేసిందన్నారు. నాడు ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పద్మాకర్‌ మొదటగా ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేయడం జరిగింది. నాటి నుండి డీజిల్‌ ధరలు పెంచినా ప్రభుత్వం మాటకు అనుగుణంగా ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వం ప్రకటించే అనేక రాయితీలు ఇస్తూ కష్టన ష్టాలకు గురైన ప్రభుత్వానికి అనుగుణంగా నడిచింది. నాడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌టిసి కష్టనష్టాలను గుర్తించి ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. సియంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సమావేశంలోనే ఆర్‌టిసి ని ప్రభుత్వంలో విలీనం పై ఆంజనేయరెడ్డి కమిటీ వేసి కమిటీ నివేదిక ఆధారంగా ఈనెల 3, 4 తేదీలలో మంత్రివర్గ సమావేశంలో ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల కార్మికుతు ఆనందోత్సాహాలతో పండుగ చేసుకోవడం జరుగుతోందన్నారు. పదవీ విరమణ వయసు ప్రభుత్వోద్యోగుల వలె 60 సం.లకు పెంచుతున్నట్లు ప్రకటించడం ఆనందదాయకమన్నారు.రాష్ట్ర విభజనతో ఆర్‌టిసికి జరిగిన నష్టాన్ని విలీనంతోనే తీర్చగలరని ఇయు రాష్ట్ర నాయకత్వం అయిన ప్రస్తుత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు పి.దామోదర్‌, వై.వి రావులు అనేక సంధర్భాలలో ప్రభుత్వం దృష్టికి మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.

ఫోటో - http://v.duta.us/_Va7uQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/CfEuRAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬