గురుపూజోత్సవాన్ని మరచిన మండల విద్యాశాఖ

  |   Telugunews

కందుకూరు : విద్యాశాఖ అత్యంత భక్తి భావంతో, గౌరవంతో నిర్వహించుకొనే గురుపూజోత్సవాన్ని కందుకూరు మండల విద్యాశాఖ మరచింది. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా విద్యాశాఖ నిర్వహించే గురుపూజోత్సవాన్ని కందుకూరు మండల విద్యాశాఖ విస్మరించింది. జిల్లాస్థాయిలో అక్కడి అధికారులు గురుపూజోత్సవం వేడుక చేస్తున్నారు కదా.. ఇకమనకెందుకులే అని అనుకున్నట్లుంది కందుకూరు మండల విద్యాశాఖాధికారి. గురుపూజోత్సవం సందర్భంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరపడం కాదు కదా.. దాని ఊసేలేకుండా పోయింది. కనీసం ప్రైవేటు పాఠశాలలు ప్రదర్శించిన విజ్ఞతను కూడా కందుకూరు మండల విద్యాశాఖ అధికారులు ప్రదర్శించకపోవడం విచారకరం. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పట్టణంలో ఒక ఫంక్షన్‌ హాలులో వేడుకగా గురుపుజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాయి. శాసనసభ్యుడు యం.మహీధర్‌ రెడ్డిని ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆహ్వానించాయి. పలువురు టీచర్లను సన్మానించి గౌరవం ప్రదర్శించాయి. కనీసం ఆపాటి విజ్ఞత కూడా మండల విద్యాశాఖ అధికారులకు లేకుండా పోవడం చర్చనీయాంశమైంది. శింగరాయకొండ మండల విద్యాశాఖ అధికారి శివనారాయణ కందుకూరు మండల విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యత నిర్వహిస్తున్నారు.

ఫోటో - http://v.duta.us/ZdFJFgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/TMB8UAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬