డ్వ్రాక్రా మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  |   Telugunews

వలేటివారిపాలెం, సెప్టెంబరు 06(ప్రభన్యూస్‌): డ్వాక్రా మహిళల సం క్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి తెలిపారు. వలేటివారిపాలెం వెలుగు కార్యాలయంలో శుక్రవారం డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూ.5.5 కోట్ల విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే మహిధర్‌ రెడ్డి చేతుల మీదుగా పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాల రికవరీలో వలేటివారిపాలెం మండలం 85 శాతం మాత్రమే ఉందన్నారు. నియోజకవర్గంలో ఉలవపాడు మండలం 91 శాతం రికవరీలో ముందంజలో ఉందన్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి మరిన్ని రుణాలను పొందేందుకు డ్వాక్రా మహిళలు ముందంజలో ఉండాలన్నారు. తీసుకున్న రుణాన్ని వృద్ధా చేయకుండా ఉత్పత్తులను తయారుచసుకొని జీవన ఆర్ధిక స్థితి గతులను మెరుగు పరచుకోవాలన్నారు. మహిళా సంఘాలందరూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా సంఘటిత శక్తులుగా ఎదగాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్ధికంగా స్థిరపడాలంటే పొదుపు సంఘాలకే సాధ్యపడుతుందన్నారు. ప్రభుత్వం ఆశించిన దానికంటే పొదుపు సంఘాల మహిళలు ఒకడుగు ముందడుగులో ఉన్నారన్నారు. ఆగిపోయిన పొదుపు సంఘాలకు బ్యాంకు ద్వారా రుణాలు పొంది తిరిగి వాటిని చెల్లించేందుకు ఒకరికి ఒకరు సహాయపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపిఎం చిన్నయ్య, బ్యాంకు మేనేజరు హనుమంతరావు, ఎంపిడిఓ విజయ్‌శేఖర్‌, తహశీల్దారు అహ్మద్‌బాషా పలువురు నాయకులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/WQdObQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/m0yZDAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬