పార్టీ నేతలతో చంద్రబాబు అల్పాహారం

  |   Telugunews

కాకినాడ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లా పార్టీ నాయకులతో బ్రేక్ ఫాస్ట్ ఆరగించారు. వారితో కీలక అంశాలపై చర్చించారు. గురువారం రాత్రి నగరంలోని జిఆర్టి గ్రాండ్ హోటల్ లో బస చేసిన చంద్రబాబు శుక్రవారం ఉదయం జిల్లా ముఖ్య నేతలను తన వద్దకు ఆహ్వానించారు. వారితో జిల్లాలో పార్టీ పరిస్థితి పై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పది మంది ముఖ్యమంత్రులు పని తీరును దగ్గర్నుండి సునిశితంగా పరిశీలించిన అనుభవం తనకు ఉందన్నారు.కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వై ఎస్,నేదురుమల్లి తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ జగన్ అంత పాలిస్తున్న అంత దారుణంగా, ఆటవికంగా ఏ ముఖ్యమంత్రి పరిపాలించ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఒక్కసారి గెలిచిన సీఎంగా జగన్ పేరు నిలబడిపోతుంది అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లా పార్టీలో కొందరు నాయకులు స్తబ్దుగా ఉన్నారు అంటూ కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు జిల్లాకు సంబంధించి కీలక నేతలు ఓ కమిటీ గా ఏర్పడాలని సూచించారు.ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమావేశాలు జరుపుకొని నిర్ణయాలు తీసుకోవాలని, యావత్ పార్టీ యంత్రాంగాన్ని ఉత్సాహపరిచే లా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కమిటీ హైదరాబాద్, అమరావతి లో ఎప్పుడైనా తనను కలవచ్చు అని అదే విధంగా తాను కూడా వారిని కలిసి చర్చిస్తామని వివరించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని హితబోధ చేసారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన, ఆధునిక సౌకర్యాలతో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారంటూ నేతలను అభినందించారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉండాలని సూచించారు. ఈ నెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమం తలపెట్టామని ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తరలి రావాలని బాబు సూచించారు. అయితే ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారని కూడా ముందే వెల్లడించారు. వంద రోజుల పరిపాలన పై నాయకులు అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అగ్ర నాయకులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు, కొండబాబు, వర్మ, వేగుళ్ళ జోగేశ్వరరావు, బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవాని, జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్, బుచ్చిబాబు, వంతల రాజేశ్వరి, బండారు సత్యానంద రావు తదితర నాయకులు హాజరయ్యారు. గొల్లపల్లి సూర్యరావు, తోట త్రిమూర్తులు మాత్రం హాజరు కాలేదు. సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు తోట త్రిమూర్తులు విషయాన్ని లెవనెత్తే ప్రయత్నం చేయగా చంద్రబాబు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అనంతరం వారితో కలిసి అల్పాహారాన్ని సేవించి జిల్లా పార్టీ కార్యాలయానికి విచ్చేసారు.

ఫోటో - http://v.duta.us/9Q6moQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/Q9meVQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬