బ్యారెన్‌ లైసెన్సు రెన్యువల్‌కు ఆంక్షలు

  |   Telugunews

కందుకూరు : రానున్న పంటకాలానికి పొగాకు బ్యారెన్‌ లైసెన్సులను పునరుద్దరించేందుకు పొగాకు బోర్డు ఆంక్షాలు విధించింది. 2019-20 కాలానికి పొగాకు సాగు చేసేవారు రిజిస్ట్రేషన్‌ పొందాలంటే ప్రతి రైతు కనీసం 10 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్న నిబంధనను పొగాకు బోర్డు అధికారులు విధించారు. ఈ నిబంధనను అతిక్రమించిన వారికి రిజిస్ట్రేషన్‌ చేయడం జరగదని తేల్చి చెప్పారు. బ్యారన్‌ లైసెన్సులు ఈ నెల 6 నుండి ప్రారంభమవుతుందని కందుకూరులోని పొగాకు వేలం నిర్వహణాధికారి మల్లెల బాబూరావు తెలిపారు. సాధారణ ఫీజు అయిన రూ.10 లతో అక్టోబర్‌ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఆతరువాత దరఖాస్తుచేసుకొనే వారు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అక్టోబర్‌ 28 తేదీ వరకు రూ.100ల అపరాధ రుసుముతో, నవంబరు 8 తేదీ వరకు రూ.400ల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందని అన్నారు. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టంచేశారు.

ఫోటో - http://v.duta.us/gx0sEAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/vF9QCQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬