‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్: కామెడీ.. కానీ, అనసూయ సీరియస్!

  |   Tollywood

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్‌ను ఖరారు చేసి ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కింగ్ ఆప్ ది హిల్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పనిచేస్తోన్న సాంకేతిక బృందమంతా కొత్తవాళ్లే. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం ప్రధాన పాత్రలు పోషించారు. అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచడానికి విజయ్ దేవరకొండ అప్పుడే పని మొదలుపెట్టారు. మొదటి బాణంగా చిత్ర టీజర్‌ను వదిలారు. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ థియేటర్‌లో ప్రేక్షకుల కడుపులు చెక్కలు చేయడం ఖాయంలా కనిపిస్తోంది. ఇప్పటికే ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన ఈ యువ దర్శకుడు ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది....

ఫోటో - http://v.duta.us/1p3m8QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/JQAblQAA

📲 Get Tollywood on Whatsapp 💬