రూ.350 కోట్లు కొల్లగొట్టిన ‘సాహో’.. అయినా ప్లాపేనా?

  |   Tollywood

యంగ్ రెబెల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘సాహో’ గత శుక్రవారం రిలీజ్ అయ్యింది. అయితే హ్యుజ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి అనుకోని విధముగా టాక్ వచ్చింది. తెలుగులో అయితే మార్నింగ్ షో తరువాత యావరేజ్ అన్న ‘సాహో’ సాయంత్రానికి మాత్రం ప్లాప్ అని తేల్చేశారు. అయితే ఆ టాక్ వచ్చినా కూడా బాహుబలి ఎఫెక్ట్‌తో ప్రేక్షకులు మాత్రం ‘సాహో’ చూడడానికి పోటీపడ్డారు. దాంతో మొదటి నాలుగురోజులు అనేక చోట్ల హౌస్ ఫుల్స్ నడిచాయి. అయితే మంగళ, బుధవారాల్లో మాత్రం ‘సాహో’ కలెక్షన్స్‌లో భారీ డ్రాప్ కనిపించింది.

అయితే హిందీ వెర్షన్ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. మన డార్లింగ్‌ని బాలీవుడ్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. అందుకే ముందు రోజు అన్నిచోట్లా అనుకున్న టైం కి షోస్ పడకపోయినా, సినిమాలో అంత మ్యాటర్ లేదు అనే టాక్ వచ్చినా కూడా ‘సాహో’ జోరుకి అక్కడ అడ్డు లేకుండా పోయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ‘సాహో’ హిందీ వెర్షన్ ఫైనల్ రిజల్ట్ హిట్‌గా డిసైడ్ అయ్యేలా ఉంది. ఆ రేంజ్‌లో వస్తున్నాయి అక్కడ కలెక్షన్స్. హిందీ వాళ్ళు తెలుగు సినిమాలు కేవలం యు ట్యూబ్‌లో చూసి మిలియన్స్ కొద్దీ వ్యూస్ తెప్పించడమే కాదు.. థియేటర్స్‌కి కదిలివెళ్ళి టికెట్ కొనే మరీ సినిమా చూసి కలెక్షన్స్ కూడా పెంచుతున్నారు అని సాహో నిరూపిస్తుంది....

ఫోటో - http://v.duta.us/t96fYgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/0Hmd7wEA

📲 Get Tollywood on Whatsapp 💬