లోపపోషణ రహిత సమాజమే లక్ష్యం

  |   Telugunews

మార్కాపురం, : పొదుపు గ్రూపులో ఉన్న సభ్యులు అంగన్‌వాడి కేంద్ర హక్కుదారులుగా వ్యవహరిస్తూ సమాజాన్ని లోపపోషణ రహితంగా మార్చేందుకు కృషి చేయాలని సిడిపిఓ జి.లక్ష్మీదేవి తెలిపారు. శుక్రవారం పట్టణ పరిధిలోని అంగన్‌వాడి కేంద్రాలలో పోషకాహార మాసోత్సవాలలో భాగంగా తల్లులకు పౌష్టికాహారం, ఓఆర్‌ఎస్‌పై గృహసందర్శన కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం మెప్మా కార్యాలయంలో హెల్త్‌రిసోర్స్‌ పర్సన్స్‌, అంగన్‌వాడి కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పొదుపు గ్రూపు సభ్యులే కేంద్రహక్కుదారులుగా వ్యవహరిస్తూ అనీమియా, డయేరియా నివారణపై, మంచి పోషకాహారం తీసుకోవడంపై తల్లులకు, బాలింతలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పిల్లలకు అన్నం పెట్టేటపుడు, తినేటపుడు మలవిసర్జన అనంతరం చేతుల పరిశుభ్రతపై సిఆర్‌పిలు, అంగన్‌వాడి కార్యకర్తలు, వార్డు వాలంటీర్లతో కలిసి గ్రూపు సభ్యులు అవగాహనపర్చాలని సూచించారు. అనంతరం ఆర్‌పిలతో ప్రతిజ్ఞ చేయించారు. మెప్మా కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ అందరు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని పోషణ లోపం లేని ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని ఆర్‌పిలకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఎల్‌ఎఫ్‌ ప్రెసిడెంట్‌ డి.రమణ, సిఎల్‌ఆర్‌పి రాణి, పి.లక్ష్మి, కోశాధికారి ఫాతిమ, అంగన్‌వాడి కార్యకర్తలు వి.పార్వతి, సరోజిని, మధుమతి పాల్గొన్నారు....

ఫోటో - http://v.duta.us/0PcIlAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/JHWbvwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬