ట్రాఫిక్‌ సమస్యపై దృష్టిసారించిన ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి

  |   Telugunews

మార్కాపురం, : పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతుండడంతో ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిట్రాఫిక్‌ సమస్యపై దృష్టిసారించారు. పట్టణంలోని ప్రధాన వీధులతో పాటు నెహ్రూబజార్‌, మెయిన్‌బజార్‌, నాయుడువీధి, సత్యనారాయణస్వామి గుడి వీధి, వెంటకరమణ స్టూడియో లైన్‌, మార్కెట్‌ సెంటర్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరం కావడంతో పట్టణ ప్రజలు సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని కోరడంతో ట్రాఫిక్‌ సమస్యను తీవ్రతరం కాకుండా ఏ విధంగా నిరోధించాలనే విషయంపై చర్యలకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో పోలీస్‌, మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్‌ మరీ తీవ్రతరంగా ఉన్న సమయాలలో ట్రాఫిక్‌ మల్లింపు, ఏయే ప్రాంతాలలో భారీకేడ్‌లు విధించే అవకాశం ఉంది, వన్‌వే లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఏయే ప్రాంతాలలో ఉందో చూడాలని అధికారులకు సూచించారు. పట్టణ జనాభా రోజు రోజుకు పెరిగిపోతుండడంతో పాటు ద్వి, త్రిచక్ర వాహనాలతో పాటు కార్లు కూడా ఎక్కువ కావడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరమైందని, వీటితో పాటు ప్రజలకు నిత్యవసర సరుకులు అందించే లారీలు, విద్యార్థులకు స్కూల్‌ వ్యాన్‌లు అధికంగా పట్టణంలో తిరుగుతుండడంతో ట్రాఫిక్‌ సమస్య మరీతీవ్రతరమైందని, స్కూల్‌ సమయాలలో స్కూల్‌ వ్యాన్‌లకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను ఏ విధంగా మళ్లించాలి, నిత్యవసర వస్తువులను తరలించే లారీలకు సమయపాలన విధించే వెసులుబాటు ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందనే అంశాలపై కూడా దృష్టిసారించాలని ఆయన అధికారులకు సూచించారు. పోలీస్‌, మున్సిపల్‌ అధికారుల సమీక్షగా ఒక అవగాహనను కుదర్చుకుని ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూడాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమీషనర్‌ నయీమ్‌ అహ్మద్‌, డి.ఇ సుభాని, సి.ఐ కె.రాఘవేంద్ర, ఎస్సై కిషోర్‌బాబులతో పాటు పలువురు మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/SydGvAEA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/e5WmKQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬