పోషకవిలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోండి..

  |   Telugunews

మార్కాపురం, పౌష్టికాహారం కొరకు పోషకవిలువలు కలిగిన ఆకుకూరలు, పాలు, పండ్లను తీసుకోవాలని సిడిపిఓ లక్ష్మీదేవి పేర్కొన్నారు. శనివారం ఐసిడియస్‌ అర్బన్‌ పరిధిలోని స్థానిక 19వ వార్డులోనిర్వహించిన పౌష్టికాహారం ఇంటింటి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పౌష్టికాహార లోపం ఉన్న వారు అధిక పోషక విలువలు గల బాలామృతం, పాలు, గుడ్లు, ఎండు ఖర్జూరం వంటివి తీసుకోవాలని, బరువు తక్కువ గల పిల్లలను గుర్తించి వారి ఎదుగుదలకు అవసరమైన న్యూట్రీషియన్‌ ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిధులైన సిఎన్‌యంయం ప్రసాద్‌ మాట్లాడుతూ డయేరియా, నులిపురుగుల నివారణపై వివరించారు. హెచ్‌ఆర్‌పి రాజేశ్వరి మాట్లాడుతూ విటమిన్‌ లోపం వలన వచ్చే అనర్థాలను, పిల్లలకు 1000 రోజుల బంగారు భవిష్యత్‌ గురించి తెలియజేశారు. సంకల్ప సొసైటీ శిలార్‌ పర్యావరణం పరిరక్షణ పరిసరాల పరిరక్షణ చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వంటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు డివిఆర్‌కె సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తల ఎల్‌.శేషమ్మ, ధనలక్ష్మి, పి.సుబ్బారెడ్డి, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/lxE3lAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/pYk_DQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬