పౌష్టికాహారంతోనే తల్లీ బిడ్డ ఆరోగ్యం సురక్షితం

  |   Telugunews

తర్లుపాడు, : సరైన పౌష్టికాహార ం తీసుకుంటనే తల్లిబిడ్డ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని ఏపియం డి.పిచ్చయ్య పేర్కొన్నారు. పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా శనివారం స్థానిక నాయుడుపల్లి కాలనీలో ఐసిడియస్‌ ఆధ్వర్యంలోనిర్వహించిన పౌష్టికాహారం ఇంటింటి వ్యవహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భవతులుగా ఉన్న ప్రతీ తల్లి సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉంటారని, ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉం డదని, తక్కువ బరువుతో జన్మించడం జరగదని తెలిపారు. గర్భవతులు, బాలింతలు, తల్లులు అంగన్‌వాడి కేంద్రానికి తప్పకుండా వెళ్లాలని, అక్కడ అందించే పౌష్టికాహార సూచనలు పాటించి బలవర్థకమైన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.అనంతరం యంపిడిఓ, ఏపియం, అంగన్‌వాడి టీచర్లు, తల్లులు చేతుల పరిశుభ్రత కార్యక్రమంలో చేతులను శుభ్రపర్చుకున్నారు. ఈ సంధర్భంగా యంపిడిఓ నరసింహులు మాట్లాడుతూ వ్యాధుల నియంత్రణలో చేతుల పరిశుభ్రత చాలా కీలకమని, గర్భవతులు, తల్లులు, చిన్నారులు అన్నం తినేముందు చేతులను శుభ్రపర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ లక్ష్మీదేవి, అంగన్‌వాడి టీచర్లు శివ, లలిత, పద్మావతి, సత్యనారాయణమ్మ, నాసరమ్మ, ఆయాలు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/qkmCEQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/RZsWewAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬