రత్నరాజు రచించిన పుస్తకాన్ని ప్రచురించిన జాతీయ పబ్లిషర్..

  |   Telugunews

వేటపాలెం, స్దానిక సెయింటాన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజి అద్యాపకుడు డా.రత్నరాజు రచించిన పుస్తకం జాతీయ పబ్లిషర్‌ చే ప్రచురించ బ డిందని కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ యస్‌. లక్ష్మణరావు తెలిపారు. కంప్యూటర్‌ఒ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అద్యాపకుడు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.రత్నరాజు ఎం రచించిన అబ్జెక్టివ్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ త్రూ సి ప్లస్‌ పుస్తకాన్ని జాతీయ పబ్లిషర్‌ రుద్ర పబ్లికేషన్స్‌ కంపెని వారు ఇంగ్లీషు బాషలో ప్రచురించారని కళాశాల ప్రిన్సిపాల్‌ డా. పొగడదండ రవి కుమార్‌ తెలిపారు. ఈ పుస్తకం జె యన్‌ టి యు కాకినాడ వారి మొదటి మరియు రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్దులకు యూనివర్శిటి సిలబస్కు అనుగుణంగా రచించినట్లు , విద్యార్దులకు సులభరీతిలో అర్దమయ్యే విధంగా రచించినట్లు మరియు విద్యార్దులు ప్రోగ్రామింగ్‌ లో ప్రావీణ్యత సాదించటానికి ఈ పుస్తకం ఉపయోగ పడుతుందని సి యస్‌ ఇ విభాగాదిపతి డా. పి. హరిణి తెలిపారు. ఈ సందర్బంగా రత్నరాజును కళాశాలఅద్యాపకులు, విద్యార్దిని విద్యార్దులు అబినందనలు తెలిపారు..

ఫోటో - http://v.duta.us/sN3OAwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/RFl8TAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬