రమ్యకృష్ణ ‘క్వీన్’ ఫస్ట్ లుక్.. జయలలిత పాత్రలో ఇద్దరు!

  |   Tollywood

ఒకప్పటి అందాల నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ వస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ వెబ్ సిరీస్‌‌లో జయలలితగా రమ్యకృష్ణ కనిపిస్తారని, దీనికి ‘క్వీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని కూడా అన్నారు. ఈ వార్తలను నిజం చేస్తూ వెబ్ సిరీస్ మేకర్స్ శనివారం ‘క్వీన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో రమ్యకృష్ణను వెనుక నుంచి చూపించారు. అంటే, జయలలిత ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నట్టు ఉన్న షాట్ అది. అన్నాడీఎంకే పార్టీ చిహ్నాన్ని గుర్తుచేస్తూ మూడు రంగుల బోర్డర్‌తో ఉన్న తెల్ల చీరను రమ్యకృష్ణ ధరించారు.

Also Read:

ఇదిలా ఉంటే, ఈ వెబ్ సిరీస్‌లో జయలలిత పాత్రను ఇద్దరు నటీమణులు పోషిస్తున్నారు. యంగ్ జయలలితగా అనిఖా సురేంద్రన్ కనిపిస్తారు. రాజకీయ నేతగా ఎదిగిన జయలలిత పాత్రను రమ్యకృష్ణ పోషించారు. ఈ వెబ్ సిరీస్‌కి గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ గతంలో ‘కిడారి’ అనే తమిళ సినిమాకు దర్శకత్వం వహించారు....

ఫోటో - http://v.duta.us/J0r5uAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/nEh8GQAA

📲 Get Tollywood on Whatsapp 💬