‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ డేట్ పిక్స్.. జోష్‌లో నందమూరి అభిమానులు..😵

  |   Tollywood

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీని ఆయన తనయుడు బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడు.

ఎన్టీఆర్ జీవితాన్ని ఒక సినిమాలో చూపించడం సాధ్యం కాదని..ఈ సినిమాను ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా రెండు భాగాలుగా తెరకెక్కించారు.

సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు టాక్ బాగున్నా..అందుకు తగ్గ కలెక్షన్లు లేక ఈ సినిమా కమర్షియల్‌గా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎదిగిన వైనం..ఎక్కడా ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా ఫ్లాట్ సాగడం..ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషన్ కంటెంట్ మిస్ అవడం ఈ సినిమా ఫ్లాప్‌కు కారణాలుగా నిలిచాాయి.కథానాయ‌కుడు ఫ‌లితం చూసిన త‌ర్వాత ‘మహానాయ‌కుడు’ పైనే అంద‌రికి అనుమానాలున్నాయి.

ముందుగా జనవరి 24న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత కథానాయకుడు ఫ్లాప్ ఎఫెక్ట్‌తో ఫిబ్రవరి 7కు పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఊగిసలాట సాగింది. ఇప్పటకే ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ మిగిలిన షూటింగ్ పార్ట్ కంప్లీటవ్వడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 22న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

కథానాయకుడు అనకున్న రీతిలో కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోవడంతో రెండో పార్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి.

మొత్తానికి ఎన్టీఆర్ సినీ రంగానికి సంబంధించిన కథానాయకుడు వర్కౌట్ కాకపోయినా..ఎన్నో మలుపులున్న ఎన్టీఆర్ రాజకీయ జీవితంతో తెరకెక్కిన ‘మహానాయకుడు’ వెండితెరపై వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/aJgsqwAA

📲 Get Tollywood on Whatsapp 💬