ఢిల్లీ దీక్ష ప్లాప్‌ అనడం రాష్ట్ర ద్రోహం : సిఎం చంద్రబాబు🤔

  |   Telugunews

ఢిల్లీ దీక్ష ప్లాప్‌ (విఫలం) అనడం రాష్ట్ర ద్రోహమని సిఎం చంద్రబాబు మండిపడ్డారు. టిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఢిల్లీ ధర్మ పోరాట దీక్షతో చరిత్ర సఅష్టించామన్నారు.

మోడి, బిజెపి విధానాలను ఎండగట్టామన్నారు. ఎన్‌టిఆర్‌ నుండి.. ఎపి భవన్‌ జాతీయ రాజకీయాలకు వేదికగా మారిందని, ఎపి భవన్‌ నుంచి టిడిపి పోరాటాలన్నీ విజయవంతమయ్యాయని చెప్పారు. జాతీయ స్థాయిలో ఎపి సమస్యల్ని అజెండా చేశామన్నారు.

ప్రతిపక్షాల ఐక్యతకు టిడిపి దీక్ష వేదిక అయ్యిందని, 5 కోట్ల ప్రజల హక్కుల సాధనకు నిరసన వేదిక అయ్యిందని తెలిపారు. రాజకీయ లాభాల కోసమే కొన్ని పార్టీలు గైర్హాజరయ్యాయని, దేశం మొత్తం ఉధఅతంగా బిజెపి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు.

మోడికి అవమానమని బాధపడేది బిజెపి, వైసిపి లేనని.. అమిత్‌ షా, జగన్మోహన్‌ రెడ్డి ఉమ్మడి బాధ అదేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరసనల వెల్లువ మోడీని అవమానించడమా..అని ప్రశ్నించారు. 5 కోట్ల ప్రజల హక్కులపై వైసిపి, బిజెపి లకు బాధ లేదని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ కు జరిగిన ద్రోహంపై ఈ రెండు పార్టీలు మాట్లాడవన్నారు. మోడి, జగన్‌ లు కుమ్మక్కై రాష్ట్ర ద్రోహం తలపెడుతున్నారని విమర్శించారు. హోదాకు సమానం అంటేనే ప్యాకేజికి ఒప్పుకున్నామని, బిజెపి ఎపికి నమ్మక ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. 11 రాష్ట్రాలకు హోదా ఇకపై ఉండదని చెప్పారు కానీ హోదా పొడిగించి మోసగించారన్నారు.

మోడి ని నిలదీసే పరిస్థితి వైసిపిలో లేదని దుయ్యబట్టారు. బిజెపి ద్రోహాన్ని జగన్మోహన్‌ రెడ్డి నిలదీయరని అన్నారు. వైసిపి, బిజెపి కుమ్మక్కును బైటపెట్టాలన్నారు. బిజెపి, వైసిపి ల దుర్మార్గాలను ఎండగట్టాలని కోరారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/iUskgQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬