తాప్సీ ప్రతీకారం ఆ హీరో పైనేనా..కారణం ఏంటో తెలుసా..🤦‍♀️

  |   Tollywood

ఎపుడైతే టాలీవుడ్‌కు టాటా చెప్పి ..బాలీవుడ్‌కు మకాం మార్చిందో అప్పటి నుంచి హీరోయిన్‌గా తాప్సీ దశ తిరిగిపోయింది. ప్రస్తుతం ఈ భామ..హిందీలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌‌కు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఇప్పటికే ‘పింక్’, ‘ముల్క్’ వంటి సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకుంది తాప్సీ.

తాజాగా ఈ భామ సుజయ్ ఘోష్ దర్శకత్వంలో ‘బద్లా’ మూవీ చేస్తోంది. ‘బద్లా’ అంటే ప్రతీకారం అనే అర్థం ఉంది. అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది.

ఈ ట్రైలర్ చూస్తుంటే మొత్తం థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ప్రముఖ బిజినెస్ ఉమెన్ అయిన తాప్సీని ఓ హోటల్‌లో బంధిస్తారు. ఆమెకు మెలుకువ వచ్చేసరిరిక ఆమె పక్కనే ఒక డెడ్ బాడీ ఉంటుంది.

ఇంతకీ తాప్సీ నిజంగానే ఆ మర్డర్ చేసిందా లేకపోతే వేరే ఎవరైనా చంపి ఈమెపై హత్యానేరం మోపరా అనేదే ‘బద్లా’ మూవీ స్టోరీ. ఈ కేసులో బయటపడటానికి తాప్సీ పేరున్న ఓ లాయర్ సాయం తీసుకుంటోంది. ఆ న్యాయవాది పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు.

‘పింక్’ తర్వాత మరోసారి అమితాబ్ బచ్చన్, తాప్సీలు ఈ సినిమాలో కలసి నటించారు. ఈ సినిమాను కూడా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కాంరు. మొత్తానికి ట్రైలర్‌తో అట్రాక్ట్ చేసేలా ‘బద్లా’ సినిమా మార్చి 8న విడుదల కానుంది.

ట్రైలర్ ఇక్కడ చూడండి -http://v.duta.us/uJ4t-QAA

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/dMIhwAAA

📲 Get Tollywood on Whatsapp 💬