ప్రియాంకతో రోడ్ షోలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్.. ఆమె రాకతో కథ మారేనా..?🚶‍♀️

  |   Telugunews

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ ఎంట్రీ కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక ప్రభావం కచ్చితంగా పార్టీకి కలిసొస్తుందని వారు గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ప్రియాంకతో ప్రచారం చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆమెకు ఆహ్వానం పంపించామని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హేమాహేమీలంతా ఓడిపోయి తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రియాంక రాకతో పరిస్థితిలో మార్పు వస్తుందని భావిస్తోంది. ప్రియాంక ప్రచారం చేస్తే కచ్చితంగా టీఆర్ఎస్‌కు ధీటైన పోటీ ఇవ్వగలమని నమ్మకంగా ఉంది.

ప్రియాంక రోడ్ షోల ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని కాంగ్రెస్ వైపు ఆకర్షించవచ్చునని.. రాహుల్‌తో కలిసి ఆమె ప్రచారానికి వస్తే పార్టీ మైలేజ్ మరింత పెరుగుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

ఇటీవలే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రియాంక గాంధీ మెదక్ నుంచి పోటీ చేయాలన్న ప్రతిపాదనను తెర పైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రియాంక మెదక్ నుంచి పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కేసీఆర్ సహకారం కూడా కోరుతామని ఆయన అన్నారు. అయితే ఆయన ధీమాకు కారణం లేకపోలేదు.ఒకప్పుడు మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేసి ఇందిరా గాంధీ 2లక్షల మెజారిటీతో గెలిచారు.

ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఇందిరా రాయ్‌బరేలీలో ఓటమిపాలయ్యారు. దీంతో ఆ తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో రాయ్‌బరేలీతో పాటు మరో సేఫ్ జోన్ నుంచి బరిలో దిగాలని భావించిన ఇందిరా మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/lxB3vwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬