మోదీకి షాక్?: భారతరత్న తిరస్కరిస్తామన్న భూపేన్ హజారికా కుమారుడు😱

  |   Telugunews

విఖ్యాత సంగీత దర్శకుడు భూపేన్ హజారికాకు భారతరత్న ఇవ్వడాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రధాని మోదీకి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ విస్మరించిన హజారికాకు బీజేపీ 'భారతరత్న' ఇచ్చిందని రెండు రోజుల క్రితమే మోదీ అసోం పర్యటనలో గొప్పగా చెప్పుకున్నారు.

ఇంతలోనే హజారికా కుటుంబం నుంచి ప్రతికూల ప్రతిస్పందన రావడం గమనార్హం. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ హజారికాకు ఇచ్చిన భారతరత్నను తిరస్కరించాలని అమెరికాలో ఉంటున్న ఆయన కుమారుడు తేజ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

భారతరత్నలు, పొడవైన బ్రిడ్జిలు.. దేశానికి అవసరమే. కానీ వీటి ద్వారా మాత్రమే దేశ ప్రజల శాంతి, శ్రేయస్సును ఇనుమడింపజేయలేం. చట్టాలు, ముందు చూపున్న నాయకుల వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది.

వారి రాజకీయ ప్రయోజనాల కోసం హజారికాను వాడుకోవడం మాకు నచ్చట్లేదు. అవార్డుకు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం కూడా రాలేదు.అయితే భారతరత్న అవార్డు తిరస్కరణపై హజారికా కుటుంబం నుంచే భిన్న వాదనలు వినిపిస్తుండటం గమనార్హం.

దీనిపై కుటుంబ సభ్యులంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హజారికా సోదరుడు సమర్‌ అభిప్రాయపడ్డారు. కాగా, కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ నుంచి వలసవచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్దులు, పార్శీలు, జైనులు, క్రైస్తవులు శాశ్వత పౌరసత్వం పొందనున్నారు.

వలసదారులందరికీ పౌరసత్వం ఇస్తే అసోం అస్తిత్వానికే ముప్పుగా పరిణమిస్తుందని స్థానికులు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భూపేన్ హజారికా వారసులు కూడా అవార్డుపై ప్రతికూలంగా స్పందించారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/3EI9YAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬