వైఎస్ జ్ఞాపకాలను తట్టి లేపారు.. యాత్రపై విజయమ్మ స్పందన..!😢

  |   Telugunews

బయోపిక్ ల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో వచ్చిన సినిమా యాత్ర. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మించారు. ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా నిర్మించిన ఈ యాత్ర సినిమా శుక్రవార రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది.

మరోసారి తెర మీద రాజన్నను చూసినట్టు ఉందని అందరు అంటున్నారు. వైఎస్ ఇంకా ప్రజల గుండెల్లోనే ఉన్నాడని మరోసారి ఈ సినిమా విజయం చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా చూసిన వైఎస్ సతీమణి విజయమ్మ్ ఎలా స్పందించారంటే.. వైఎస్ జ్ఞాపకాలను తట్టి లేపారు.

కోట్లాది మంది హృదయాల్లో నిలిచిన వైఎస్ జ్ఞాపకాలను మరోసారి నిద్ర లేపారని వైఎస్సార్ మన ముందు లేకున్నా ఆయన్ను మన ముందుకు తెచ్చారు దర్శక

నిర్మాతలు.ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రతి నిమిషం ఆలోచించే వారు.. వైఎస్ ను ఆదరించినట్టుగానే ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు విజయమ్మ.

దర్శకుడు మహి వి రాఘవ్ సినిమాను చాలా చక్కగ తెరకెక్కించారు. సినిమా మంచి ఎమోషనల్ జర్నీలా సాగింది. ఇక వసూళ్ల పరంగా కూడా యాత్ర అదరగొడుతుంది.

డిజిటల్ రైట్స్ లో ఇప్పటికే 8 కోట్లు వసూళు చేయగా శాటిలైట్ రైట్స్ లెక్క తెలియాల్సి ఉంది. సినిమాలో మమ్ముట్టి నటనకు అందరు ఫిదా అవుతున్నారు. ఆయన కాబట్టే ఈ సినిమాకు పూర్తి న్యాయం జరిగిందని చెబుతున్నారు. మరోసారి తన నటనా ప్రతిభతో ఆడియెన్స్ ను మెప్పించారు మమ్ముట్టి.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/URD33wAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬